Skip to content

బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం

బ్లాగులు బ్లాగర్లకు సంబంధించిన ఆధారాలతో నిర్మితమైన ప్రత్యేక గడి

 

కూర్పు: భరద్వాజ్ వెలమకన్ని

చిత్తరువు: కోడిహళ్ళి మురళీమోహన్..

 

మీ సమాధానాలను editor@maalika.org కి పంపండి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన ఒక విజేతకు బహుమతి పంపబడుతుంది.

 

 

 

 

ఆధారాలు:

 

అడ్డం :

1. హేమిటో ఈ అమాయక చక్రవర్తిగారిని “కిక్” సినిమాలో హీరోయిన్ ఎవరని అడిగితే రంగమ్మ అని అన్నార్ట!

 

5. శైలబాలగారికిష్టమైన నది, అయితే అది మీదీ కాదు, మనదీ కాదు – ఒక స్త్రీవాద బ్లాగు

 

7. అమెరికా బెంగళూర్ల మిశ్రమ బ్లాగు వ్రాసేవారి పేరు

 

10. “కెలుకుడు” ప్రక్రియ ఈ బ్లాగులోనే ప్రారంభమైంది

 

12. రెండునిముషాల మేగీని ఒక నిముషంలోనే ఎలా చెయ్యాలో చెప్పిన బ్లాగు

 

13. కొత్తగా మొదలయిన “షాడో”  బ్లాగు

 

16. కార్తీక్ అనబడే ఈయన బ్లాగులో అడుగు మిస్సయ్యి తల కాస్త సాగింది

 

17. తెనాలి వారి బిఱుదు ఒంగోలువారిది కూడానా?

 

22. అమెరికా జూదగృహాల యజమానిగారి కార్డు కన్నడ ఇంటిపేరుగలవారి తెలుగుబ్లాగెలా అయ్యింది చెప్మా?

 

23. ఈ బ్లాగు పేరు తిరగబడింది. కారణం ప్రముఖ తెలుగు పత్రిక యజమానే!

 

24. గడికి సమాధానాలు దొరకకపోతే మీరు మీ గోత్రనామాలు పంపించే ఆయన బ్లాగిది!

 

 

నిలువు:

 

2. మధురభావాల మాల! ఏదో మిస్సయినట్టుందే?

 

3. పొద్దుగడులు సమకూర్చే విదేశి తెలుగు రచయితగారి సంక్షిప్తనామం

 

4. బ్లాగుల్లో త్రాష్టుడూ, నరహంతకుడు గట్రా గట్రా గట్రా … సరదాగా అంటున్నాలేండి. చాలా సరుకున్న బుఱ్ఱ, ఇంటిపేరు లేకుండా!

 

5. తెలంగాణాని ఏకిపారేసే ఈయన స్క్రీన్ పేరు చిందరవందరైంది.

 

8. యమలోకంనుండి కూడా బ్లాగులు వ్రాస్తానంటూ చెప్పుకునేవారి స్క్రీన్ పేరు

 

9. ఓ సామాన్యుడి స్క్రీన్ పేరు తలక్రిందులై తలకాయ తెగ్గోసుకుంది

 

11. దుర్గం కరువైన ప్రముఖ బ్లాగర్ ఇంటిపేరు చిందరవందరైంది

 

12. ఆచార్య ఫణీంద్ర గారి సాహిత్యపీఠంలో ఒక భాగం

 

13. ఇదొక సంకలిని – కాకపోతే కాస్త వివాదాస్పదం

 

15. సెల్ ఫోనులు, అక్రమసంబంధాలు ఎక్కువగా కనబడే బ్లాగుకి యజమాని.

 

16. బ్లాగుల్లో హాస్యం అనగానే జనాలకు గుర్తొచ్చే బ్లాగు.

 

18. 10 అడ్డం చివరి రెండక్షరాలతో కలిపితే శ్యామలరావుగారి బ్లాగులా స్ఫురిస్తుంది.

 

20. “పాత సామాన్లు కొంటాం” అన్నట్టు “కొత్త బ్లాగర్ల టెంప్లేట్లు మారుస్తాం” అంటూ తిరిగే అక్కయ్యగారి ఇంటిపేరు తిరగబడిందోచ్

 

22. తోక తెగిన 5 నిలువుగారి ఇంటిపేరు

భరద్వాజ్ వెలమకన్ని

Written by: భరద్వాజ్ వెలమకన్ని

Comments are closed.

Slider by webdesign