మూడవ కన్ను ఒక అంతర్నేత్రం

రచన: ఉమదేవి పోచంపల్లి

మనోభావాలను గమనిస్తూ
జీవన్మార్గాన్ని బోధిస్తూ
శాంతితో విశ్రమిస్తూ
సమాధి లాంటి
ఏకాగ్రతలో
సుషుప్తిలో
ఉందో?
తట్టి
లేపకు
లేచిందో
నిద్రాణమైన
త్రినేత్రం లోంచి
ప్రజ్వరిల్లే భానురేఖలు
భాసిల్లుతూ ప్రచండ తీవ్రత తో
మండే గుండెల చప్పుడు ఇంధనాలతో
శతసహస్ర సూర్యుల కాంతిరేఖలు ప్రసరిస్తూ,
శక్తినంత క్రోడీకరించి అసభ్యతను, అన్యాయాన్ని
నిస్సహాయులపై దౌర్జన్యాన్ని, దళారీతనాన్ని, కటిక
దౌర్భాగ్యాన్ని తుత్తునియలు చేసి, భస్మీపటలమ్ చేసి
బ్రతుకు భారాన్ని తగ్గించే బంగారు క్షణాలు అతి దగ్గరలోనే
అనంతమైన భూభారం లో రవంతైనా భారాన్నిత్రుంచి వేసే రోజు
రాదేమింకా, తెలవారదేమింకా? నేను, నువ్వూ నడిపించేదాకా, ఇంకా?

1 thought on “మూడవ కన్ను ఒక అంతర్నేత్రం

Leave a Comment