• Uncategorized
 • 5

‘చందమామ’ విజయగాథ

You may also like...

5 Responses

 1. subramanyam says:

  chandamaama kathalu online lo ekkadainaa dorikite cheppagalaru

  • 1947 నుంచి 2006 వరకు 60 ఏళ్ల చందమామ కథలను ఆన్‌లైన్‌లో కింది లింకును తెరిచి చదువుకోవచ్చు. సంవత్సరం, మీ భాష, నెల ఎంపికలను ఎంచుకుని మీక్కావలసిన చందమామలను మీరు కిందిలో చూడవచ్చు. 2010 వరకు చందమామలను ఆన్‌లైన్‌ ఆర్కైవ్స్‌లో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

   http://chandamama.com/archive/TEL/storyArchive.htm

 2. శివరామప్రసాద్ కప్పగంతు says:

  పాత కాలం ఎప్పటికప్పుడు గొప్పగానే కనిపిస్తుంది. కాని ప్రస్తుతం ఆ “గతం” తో పోలిస్తే తేలిపోతూ ఉంటుంది, చందమామ ఒకప్పుడు మంచి పత్రిక, రెండు మూడు తరాల పిల్లల ఆలోచనా సరళిని ప్రభావితం చేసిన పత్రిక. కొడవటిగంటి కుటుంబరావుగారు సంపాదకత్వం ఉన్నన్నాళ్ళూ పత్రిక బాగా నడిచింది. ఒక్కోరోక్కరే పెద్ద వాళ్ళు, శ్రీ చక్రపాణి, శ్రీ చిత్రా, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, శ్రీ వపా , వెళ్లిపోవటంతో పత్రిక ప్రాభవం తగ్గుముఖం పట్టింది.

  ఇప్పుడు అదే పేరుతొ వస్తున్నా, అలనాటి “మెరుపు” పత్రికలో లేదు. ఇప్పటికీ ముఖ చిత్రం గీయటానికి సవ్యమైన చిత్రకారుని తెచ్చుకోలేక పోయింది.

  అప్పుడెప్పుడో అద్భుతాలు అనుకోవటం బాగానే ఉన్నది కాని, ఇప్పటి రోజున కూడా మంచి బొమ్మలతో చందమామ రావాలని అలనాటి చందమామ ప్రియుల ఆకాంక్ష. ఎప్పటికప్పుడు ఆ పాత బొమ్మలనే కాపీ చెయ్యటం, పాత దారావాహికలనే మళ్ళి మళ్ళి వెయ్యటం చూస్తుంటే, చందమామ ఇంత కంటే ఏమీ చెయ్యలేదా అనిపిస్తున్నది. కొత్త జవ జీవాలు పత్రికలో రావాలి. ఉట్టి మానేజిమెంట్ సిద్ధాంతాలు పత్రికను నడపలేవు. పత్రికను నడిపేది సృజనాత్మకత. అది తెలుసుకోవాలి ఈ నాటి యాజమాన్యం.

 3. ధన్యవాదాలు లలితగారూ,
  “…నమ్మే విలువలని, ఆచరించే విలువలని, ఆశించే విషయాలనీ చెప్పే పెద్ద వారికి మల్లే కల్మషం లేకుండా చెప్పగలగడం, అలా చెప్పడాన్ని ఏళ్ళ తరబడి కొనసాగించడం, ఇటువంటివన్నీ ఒక ఫార్ములాలో ఇమడని విషయాలు. నిరంతర ప్రయాసతోనే సాధ్యమయ్యే విషయాలు.”

  మీ వ్యాఖ్య అక్షరసత్యం. అజరామరమైన 12 జానపద సీరియల్స్‌తో చందమామ చరిత్రను ఉద్దీప్తంచేసిన దాసరి సుబ్రహ్మణ్యం గారు, జీవితం చివరి క్షణాలవరకు చందమామను ఇతర పత్రికలతో పోల్చి చూస్తూ వచ్చారు. ప్రతి పేజీలో బొమ్మ.. స్కేల్‌పెట్టి కొలిచినట్లు పేజీ చివరలోనే కథ ముగియడం.. 12 బాషలలో తొలి పుటనుంచి చివరి పుటవరకు ఒక్క పేజీ కూడా మారకుండా ఒకే రూపంలో దశాబ్దాలు కొనసాగడం..ఒక రచయిత కథ ఒకే నెలలో 12 భాషలలో అచ్చుకావడం.. పత్రికల చరిత్రలో ఇదొక అరుదైన ఘటన అంటూ దాసరి గారు ఒక సందర్భంలో చెప్పారు. చందమామ ఫార్మాట్‌ని ఏ ఇతర పత్రిక కూడా అనుకరించలేకపోవడమే చందమామ విజయం అని దాసరి గారి అభిప్రాయం.. ఈ కోణంలో చందమామను అధిగమించే పత్రిక సమీప భవిష్యత్తులో కూడా లేదని ఆయన 2008లో రాసిన ఓ లేఖలో చెప్పారు.

  1950 నుంచి 80 వరకు చందమామ అందించిన అనితరసాధ్యమైన నాణ్యతను ఇప్పుడు అందించలేకపోయినా పాఠకులు, అభిమానులు తమకే సాధ్యమైన సహన భావంతో చందమామను అభిమానిస్తున్నారు. నిర్వహణలో అనుకోకుండా వస్తున్న లోపాలను సహిస్తూనే, విమర్శిస్తూనే, ఎత్తిచూపుతూనే… చందమామ ఉన్నతిని కోరుకుంటున్నారు. సహస్ర చంద్రదర్శనాలను చూసిన మాన్య వృద్ధులు చందమామను చదువుతూనే సెలవు తీసుకోవాలనే కోరికను భావోద్వేగంతో ప్రకటిస్తున్నారు. తరతరాలుగా భారతీయ కుటుంబాలను చందమామ పరామర్శిస్తూ వెలుగుతుందంటే ఈ అలనాటి వృద్ధులు పంచిపెట్టిన కథామృత రూపంలోని అభిమానమే ఏకైక కారణం.

  చందమామ పట్ల పిల్లలు, పెద్దలు, వృద్ధులు దశాబ్దాలుగా చూపుతూ వస్తున్న ఈ నిర్మల ప్రేమాభిమానమే పత్రికకు ఈనాటికీ జీవం పోస్తోంది. చందమామ నిర్వహణలో వస్తున్న అనివార్య లోపాలను అదే ప్రేమతో సహిస్తోంది.

  లలితగారూ, చందమామతో సంబంధాన్ని మీరు పరాయిదేశంలో ఉంటూ కూడా కొనసాగిస్తున్నారు. రెండేళ్లుగా చందమామకు అనువాద రూపంలో విశిష్ట సేవలందిస్తున్నారు. విదేశంలో ఉంటూ కూడా మీ పిల్లలు తెలుగుకు దూరం కాకుండా తల్లిదండ్రులుగా మీరు శతథా ప్రయత్నిస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలు దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న ఈ అఖండ బంధమే చందమామ ఉనికిని ఇంకా కాపాడుతోంది.

  మీలాంటి అభిమానుల సాక్షిగా, భారతీయ కుటుంబాల నిర్మల ప్రేమ సాక్షిగా చందమామ కొనసాగుతుందని, కథా వెన్నెలలు వెదజల్లుతుందని ఆశిస్తున్నాము.

 4. చందమామకు పాఠకుల మనసుల్లో అటువంటి స్థానం ఎందుకు కలిగిందో అన్నది మాటల్లో పెట్టగలిగేది కాదు. పాత చందమామలు తిరగేస్తుంటే మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఆ సారం తిన్నగా మనసుకి అర్థం కావలిసిందే. చందమామలో కథలు ప్రచురింపబడుతున్నాయన్న ఆనందం కంటే నేను అభిమానించే కథల ప్రమాణాలకి తగ్గట్టుగా నేను రాస్తూ ఉండగలగాలంటే నేను ఏం చెయ్యాలి అన్న ప్రశ్నే నన్ను ఎక్కువ వెంటాడుతుంటుంది.
  మీ వ్యాసంలో మీరిచ్చిన పాయింట్లు నాకు కావలిసిన సమాధానానికి ఒక starting point.
  నాణ్యత: భాషలో, బొమ్మల్లో, పిల్లలని ఆలోచింపచేసే తీరులో … ఆత్మీయంగా తన వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని తను నిజాయితీగా నమ్మే విలువలని, ఆచరించే విలువలని, ఆశించే విషయాలనీ చెప్పే పెద్ద వారికి మల్లే కల్మషం లేకుండా చెప్పగలగడం, అలా చెప్పడాన్ని ఏళ్ళ తరబడి కొనసాగించడం, ఇటువంటివన్నీ ఒక ఫార్ములాలో ఇమడని విషయాలు. నిరంతర ప్రయాసతోనే సాధ్యమయ్యే విషయాలు. మరీ అమాయకత్వాన్ని కూడ నింపుకోలేదు ఈ కథలు. నిజానికి పంచతంత్రం కథలలాగానే మనుషుల్లోని వైవిధ్యాలనీ, లోకం తీరునీ తెలివిగా తెలియజేయగలగడమే చందమామ కథల గొప్పతనం.
  ఆ నాణ్యతను ఇప్పటికీ డిమాండు చేసే పాఠకులతో పాటు, ఆ జ్ఞాపకాల మూలంగా ఇప్పటికీ పత్రికని ఆదరించే ఆ తరం వారితో పాటు ఆ కథలు చదువుతూ పెరిగి తాము నేర్చుకున్న జీవిత పాఠాలను, తమ తరువాతి తరం వారికి తాము అందించాలనుకున్న ఆలోచనలను అదే నిజాయితీతో రాసే రచయితలూ, వాటికి రూపమివ్వగలిగే చిత్రకారులూ, చందమామ పత్రికను నడుపుతున్నది నిజానికి పాఠకులు, వారి expectations, ఆ పత్రికకి ప్రాణం పోసేది ఆర్టిస్టులతో సహా పత్రికను తీర్చిదిద్దే బృందం అనీ, తామొక గొప్ప వారసత్వాన్ని బాధ్యతాయుతంగా కొనసాగించాలి అని తెలుసుకున్న యాజమన్యమూ కలిసి ఈ పత్రికను చిరకాలం స్థాపకుల సంకల్పం ప్రకారం, మారుతున్న కాలంలో మారని విలువలకి ప్రతీకగా కొనసాగించాలనీ ప్రతి చందమామ అభిమాని ఆశ అనిపిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *